6.
మొగ్గ దశలోని పుష్పంలో పరిపత్రభాగాల అమరికను 'పుష్పరచన' అంటారు. ఇది
కవాటయుతం (హైబిస్కస్‌లో రక్షక పత్రావళి), మెలితిరిగి (దతురాలోని ఆకర్షణ
పత్రావళి), ఆరోహక చిక్కైన (సిసాల్పినేసి కుటుంబంలోని ఆకర్షణ పత్రావళి),
అవరోహక చిక్కైన (ఫాబేసిలోని ఆకర్షణ పత్రావళి), క్విన్ కన్షియల్
(ఐపోమియాలోని రక్షక పత్రావళి) రకాలుగా ఉంటుంది.
7. కేసర దండానికి
పరాగకోశం పీఠ సంయోజితం (దతురా), ఆశ్లేషితం (నీలంబో), పుష్ఠ సంయోజితం
(హైబిస్కస్), బిందుపద సంయోజితం (ఒరైజా) పద్ధతుల్లో సంలగ్నత చెంది ఉండవచ్చు.
8. కేసరాల సంలగ్నత రెండు రకాలుగా ఉండవచ్చు. ఎ. కేసరాల సంసంజనం బి. కేసరాల అసంజనం 9. పుష్పంలోని కేసరాలు ఒకదానిలో ఒకటి సంయుక్తమవడాన్ని కేసరాల సంసంజనం అంటారు. కేసరాల యొక్క కేసర దండాలు సంయుక్తమై పరాగ కోశాలు విడిగా ఉంటే దాన్ని 'కేసర దండ సంయుక్తత' అంటారు (హైబిస్కస్). పరాగకోశాలు మాత్రమే సంయుక్తమై కేసర దండాలు విడిగా ఉంటే దాన్ని 'పరాగ కోశ సంయుక్తత' అంటారు (ట్రైడాక్స్ - ఆస్టరేసి). పుష్పంలోని కేసర దండాలు, పరాగ కోశాలు రెండూ సంయుక్తంగా ఉంటే 'సంయుక్త కేసరావళి' అంటారు. (కుకుర్బిటా) |
Friday, December 13, 2013
pushpam
botany kanagalu shastravethalu
|
Subscribe to:
Posts (Atom)