Friday, December 13, 2013

pushpam






















10. అండకోశంలోని ఫలదళాల సంఖ్యను బట్టి పుష్పాలు ఏక ఫలదళయుత (డాలికస్), ద్విఫలదళయుత (సొలానం), త్రిఫలదళయుత (అలియం), చతుర్ ఫలదళయుత (ఈనోథెరా), పంచ ఫలదళయుత (హైబిస్కస్) మరియు బహు ఫలదలయుతంగా (అబుటిలాన్) ఉంటాయి. ఫలదళాలు సంయుక్తంగా లేదా అసంయుక్తంగా ఉంటాయి.
11.  అండాశయంలోని బిలాల సంఖ్యను బట్టి పుష్పాలు ఏకబిలయుతం (డాలికస్), ద్విబిలయుతం (సొలానం), త్రిబిలయుతం (అల్లియం), చతుర్బిలయుతం (విపొమియా), పంచబిలయుతం (హైబిస్కస్) మరియు బహుబిల యుతంగా (అబుటిలాన్) ఉంటాయి
6. మొగ్గ దశలోని పుష్పంలో పరిపత్రభాగాల అమరికను 'పుష్పరచన' అంటారు. ఇది కవాటయుతం (హైబిస్కస్‌లో రక్షక పత్రావళి), మెలితిరిగి (దతురాలోని ఆకర్షణ పత్రావళి), ఆరోహక చిక్కైన (సిసాల్పినేసి కుటుంబంలోని ఆకర్షణ పత్రావళి), అవరోహక చిక్కైన (ఫాబేసిలోని ఆకర్షణ పత్రావళి), క్విన్ కన్షియల్ (ఐపోమియాలోని రక్షక పత్రావళి) రకాలుగా ఉంటుంది.
7. కేసర దండానికి పరాగకోశం పీఠ సంయోజితం (దతురా), ఆశ్లేషితం (నీలంబో), పుష్ఠ సంయోజితం (హైబిస్కస్), బిందుపద సంయోజితం (ఒరైజా) పద్ధతుల్లో సంలగ్నత చెంది ఉండవచ్చు.
8. కేసరాల సంలగ్నత రెండు రకాలుగా ఉండవచ్చు.
    ఎ. కేసరాల సంసంజనం
    బి. కేసరాల అసంజనం
9. పుష్పంలోని కేసరాలు ఒకదానిలో ఒకటి సంయుక్తమవడాన్ని కేసరాల సంసంజనం అంటారు. కేసరాల యొక్క కేసర దండాలు సంయుక్తమై పరాగ కోశాలు విడిగా ఉంటే దాన్ని 'కేసర దండ సంయుక్తత' అంటారు (హైబిస్కస్). పరాగకోశాలు మాత్రమే సంయుక్తమై కేసర దండాలు విడిగా ఉంటే దాన్ని 'పరాగ కోశ సంయుక్తత' అంటారు (ట్రైడాక్స్ - ఆస్టరేసి). పుష్పంలోని కేసర దండాలు, పరాగ కోశాలు రెండూ సంయుక్తంగా ఉంటే 'సంయుక్త కేసరావళి' అంటారు. (కుకుర్బిటా)

botany kanagalu shastravethalu

                                                కణాంగాలు
       పేరు
      కనుక్కున్న
  శాస్త్రజ్ఞుడు/ సంవత్సరం
    పెట్టినపేరు / ఇతరపేర్లు
   అంతర్జీవ ద్రవ్యజాలం
   కె.ఆర్. పోర్టర్ (1953)
    అంతర్జీవ ద్రవ్యజాలం
   రైసోసోమ్‌లు
   జార్జ్‌పెలేడ్ (1953)
   పెలెడె రేణువులు,
   సార్వత్రిక కణాంగాలు,
   అతిపురాతన
కణాంగాలు
   గాల్జీ పరికరం
   కామిల్లో గాల్జీ(1898)
    గాల్జీదేహాలు,
    ఇడియోసోమ్‌లు,
    లైపోకాండ్రియాలు,
    బెకర్ దేహాలు
   లైసోసోమ్‌లు
   క్రిస్టియన్ డి దూవె (1955)
    లైసోసోమ్‌లు
   పెరాక్సీసోమ్‌లు
   రోడిన్ (1954)
    సూక్ష్మదేహాలు
   గ్లైఆక్సీసోమ్‌లు
   బ్రైడెన్‌బాక్ (1967)
    సూక్ష్మదేహాలు
   కేంద్రకం
   రాబర్ట్ బ్రౌన్ (1931)
          -